Apps:
Follow us on :
E Paper Login
ఫ్లాష్ వార్తలు MP Election: ఓటర్ల ఉత్సాహం గత ఎన్నికల రికార్డును బద్దలు కొట్టింది.. అన్ని పార్టీల్లో మొదలైన టెన్షన్ ఓటు హక్కు వినియోగం.. ప్రజాస్వామ్యం బలోపేతమంటున్న తెలంగాణ యువత Gold Price Today: షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే.. Amit Shah: అధికారమే లక్ష్యంగా స్పీడు పెంచిన కాషాయ దళం.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతల రాక.. Telangana Election: బీఆర్ఎస్ కారును ప్రధాని మోదీ సంక్షేమ పథకాల గ్యారేజీకి పంపించాలిః అమిత్ షా

ఓటు హక్కు వినియోగం.. ప్రజాస్వామ్యం బలోపేతమంటున్న తెలంగాణ యువత

Telangana :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్నవారే ఒక కోటి 67 లక్షల మంది. అంటే ఈ ఎన్నికల్లో యువతదే ప్రధాన పాత్ర ఉండనుంది. అన్ని నియోజకవర్గాల్లో యువ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇక కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నవారు ఎక్కువగానే ఉన్నారు. మొదటిసారి ఓట వేయడానికి జోష్‌లో ఉన్న యువత వివిధ అంశాలతో ముందుకెళ్తున్నారు..

 

తెలంగాణలో ఎలక్షన్ హీట్ వేవ్ వీస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో యువత పాత్ర కీలకం కానుంది.. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు సగానికి పైగా తెలంగాణలో ఉన్నారు. అయితే ఈసారి 18 ఏళ్లు దాటిన యువతీ యువకులకు కొత్తగా ఓటు పొందిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఈ యువత ఎలక్షన్స్‌పై ఏమనుకుంటున్నారు. ఏఏ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయనున్నారు. అన్నదీ ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్నవారే ఒక కోటి 67 లక్షల మంది. అంటే ఈ ఎన్నికల్లో యువతదే ప్రధాన పాత్ర ఉండనుంది. అన్ని నియోజకవర్గాల్లో యువ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇక కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నవారు ఎక్కువగానే ఉన్నారు. మొదటిసారి ఓట వేయడానికి జోష్‌లో ఉన్న యువత వివిధ అంశాలతో ముందుకెళ్తున్నారు..

 

మొదటి సారిగా ఓటు హక్కు వచ్చిన యువత అంతకు మించి అన్నట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త ఓట్లు నమోదు చేయడంలో ఎలక్షన్ కమీషన్ కల్పించిన ప్రచారంతో ఎక్కువ మంది ఓటర్స్ ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకున్నారు. గతంలో యువత ఓట్లు ఎక్కువగా ఉన్నా, పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసింది మాత్రం తక్కువే. పోలింగ్ డే ను హాలిడే గా భావించి టూర్స్ ట్రిప్స్ వేసే వారు లేకపోలేదు. కానీ ఈసారి మాత్రం తమకు వచ్చిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యువత..

 

తదుపరి చదవండి