Apps:
Follow us on :
E Paper Login
ఫ్లాష్ వార్తలు ఓటు హక్కు వినియోగం.. ప్రజాస్వామ్యం బలోపేతమంటున్న తెలంగాణ యువత Telangana Election: ఇటు అరవింద్.. అటు జీవన్ రెడ్డినే టార్గెట్.. పక్కా వ్యూహంతో ఎమ్మెల్సీ కవిత..! Allu Arjun - Trivikram Movie Update | త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ రెట్రో లుక్ Telangana Election: బీఆర్ఎస్ కారును ప్రధాని మోదీ సంక్షేమ పథకాల గ్యారేజీకి పంపించాలిః అమిత్ షా MP Election: ఓటర్ల ఉత్సాహం గత ఎన్నికల రికార్డును బద్దలు కొట్టింది.. అన్ని పార్టీల్లో మొదలైన టెన్షన్

Akhil Akkineni: అయ్యగారు తో వందకోట్ల సినిమా..! అఖిల్ నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్డేట్.!

Telangana :

ఏజెంట్‌ ఫ్లాప్‌ తర్వాత పబ్లిక్‌ అప్పియరెన్స్ ఇవ్వడం మానేశారు హీరో అఖిల్‌. నెక్స్ట్ బిగ్‌ లెవల్లో ప్లాన్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అది కూడా కొత్త డైరక్టర్‌తో. అఖిల్‌ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? అతన్ని గైడ్‌ చేస్తున్నదెవరు.? ఎన్నాళ్లుగానో వెయిట్‌ చేసిన హిట్‌ని మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌తో అందుకున్నారు హీరో అఖిల్‌. మంచి లవ్‌, ఫ్యామిలీ స్టోరీలు ఈ హీరోకి సెట్‌ అవుతాయని అక్కినేని అభిమానుల్లో హ్యాపీనెస్‌ కనిపించింది.
ఏజెంట్‌ ఫ్లాప్‌ తర్వాత పబ్లిక్‌ అప్పియరెన్స్ ఇవ్వడం మానేశారు హీరో అఖిల్‌. నెక్స్ట్ బిగ్‌ లెవల్లో ప్లాన్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అది కూడా కొత్త డైరక్టర్‌తో. అఖిల్‌ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? అతన్ని గైడ్‌ చేస్తున్నదెవరు?

ఇక హీరో కెరీర్‌ గాడిలో పడ్డట్టేనని అనుకున్నారు అభిమానులు. అయితే వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఫ్యామిలీ జోనర్‌ని పక్కనపెట్టి నేను యాక్షన్‌ హీరో అంటూ ఏజెంట్‌తో రంగంలోకి దిగారు అఖిల్‌.
ఏజెంట్‌ కోసం లుక్‌ మార్చి, ఇంకో రేంజ్‌లో కష్టపడ్డారు. అయినా ప్రజలు తూచ్‌ అనేశారు. అట్టర్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది ఏజెంట్‌. ఆ సినిమా ఫెయిల్యూర్‌ అయ్యాక అఖిల్‌ కాస్త టైమ్‌ తీసుకున్నారు.
పబ్లిక్‌ అప్పియరెన్సులు కూడా తగ్గించారు. ఇప్పుడు ఓ కథని ఓకే చేశారన్నది టాక్‌. ఆ కథను కూడా ఫ్రెష్‌ డైరక్టర్‌ వంద కోట్ల బడ్జెట్‌తో హ్యాండిల్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏజెంట్‌ తర్వాత ఈ కథను అఖిల్‌ సొంతంగా ఓకే చేశారా?

లేకుంటే నాగ్‌ గైడెన్స్ తీసుకున్నారా? అనే డిస్కషన్‌ ఆల్రెడీ షురూ అయింది. ఫ్లాప్‌ హీరో మీద అంత బడ్జెట్‌ వర్కవుట్‌ అవుతుందా అనే చర్చలు కూడా నడుస్తున్నాయి.

కొత్త హీరో మీదే వంద కోట్ల సినిమా వర్కవుట్‌ అయినప్పుడు, కథ బావుండి కాన్ఫిడెంట్‌గా పెడితే తప్పకుండా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందనే వెర్షన్‌ కూడా వినిపిస్తోంది.

తదుపరి చదవండి