Apps:
Follow us on :
E Paper Login
ఫ్లాష్ వార్తలు మహేష్ బాబు తుపాకీ సినిమా మిస్ చేసుకోవడానికి కారణం ఆయనేనట..! ఓటు హక్కు వినియోగం.. ప్రజాస్వామ్యం బలోపేతమంటున్న తెలంగాణ యువత Allu Arjun - Trivikram Movie Update | త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ రెట్రో లుక్ Telangana Election: బీఆర్ఎస్ కారును ప్రధాని మోదీ సంక్షేమ పథకాల గ్యారేజీకి పంపించాలిః అమిత్ షా Gold Price Today: షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

India :

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, పండుగల సమయాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరి చూపు బంగారం, వెండి ధరలపై ఉంటుంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం (నవంబర్ 22) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,020 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.350, 24క్యారెట్లపై రూ.380 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.400 మేర పెరిగి.. 76,400 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.62,170 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,300, 24 క్యారెట్ల ధర రూ.62,510, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,020 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది.
 

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,400 గా ఉంది. ముంబైలో రూ.76,400 ఉండగా.. చెన్నైలో రూ.79,400, బెంగళూరులో రూ.75,000 ఉంది. కేరళలో రూ.79,400, కోల్‌కతాలో రూ.76,400 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,400, విజయవాడలో రూ.79,400, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,400 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

 

 

తదుపరి చదవండి